మొత్తానికి  షకీలాగా మారిపోయిందట 

15 Mar,2019

రెండు దశాబ్దాల క్రితం షకీలాకు సౌత్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉండేది అని ఎవరిని అడిగిన చెప్పేస్తారు .. ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం సైడ్ అయ్యేవారు. అంతలా ఇమేజ్ తెచ్చుకున్న షకీలా జీవిత కథతో బయోపిక్ వస్తున్నా విషయం తెలిసిందే. సంచలనం తార కాబట్టి షకీలా బయోపిక్ పై చాలామందికి ఆసక్తి నెలకొంది.   'డర్టీ పిక్చర్'  స్టైల్ లో 'షకీలా' కూడా అందరికీ ఆమె జీవితాన్ని పరిచయం చేయడం ఖాయమే.  ఈ సినిమాలో షకీలా పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తోందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోస్ లో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. రిచా చద్దా మెయిన్  స్ట్రీమ్ బాలీవుడ్ సినిమాల్లో నటించినా అవి దాదాపుగా ఆఫ్ బీట్ స్టైల్ లో ఉంటాయి.  'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 1 & 2'.. 'ఫక్రే'.. 'సరబ్జీత్'.. ఇలా ఉంటుంది లిస్టు. అంతే కాదు ఇతర బాలీవుడ్ బ్యూటీల మాదిరిగా ఊరికే గ్లామర్ ఒలకబోసే రకం కాదు. కానీ  హాటుగా అప్పుడప్పుడు  కనిపించి అందరి మతులు పోగొట్టింది.  గతంలో విద్యాబాలన్ కు 'డర్టీ పిక్చర్' తో పెద్ద బ్రేక్ వచ్చి స్టార్ అయినట్టుగా 'షకీలా' విషయంలో సీన్ రిపీట్ అయ్యి రిచాకు బ్రేక్ వస్తుందేమో వేచి చూడాలి. 

Recent Gossips